భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..భీకర ప్రవాహం.. కొడుకును మోస్తూ స్కూల్కు వెళ్లిన తండ్రి…
కొడుకు చదువు కోసం తండ్రి సాహసం చేశారు. నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు బిహార్లోని నదులు ఉప్పొంగుతున్నాయి.
బగాహాలో సమయానికి పాఠశాలకు తీసుకెళ్లాలని తండ్రి తన కొడుకును భుజాలపై మోస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మసాన్ నదిని దాటారు.
అంతటి భీకర ప్రవాహంలో ఏ చిన్న పొరపాటు జరిగినా వారిద్దరి ప్రాణాలు పోయేవి. కాగా ఇప్పటికీ అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు….

