భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…బంగాళాఖాతంలో అల్పపీడనం
వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో పాటు కోస్తాంధ్ర, తెలంగాణ నుండి మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఉత్తర ఒడిశా, జార్ఖండ్ వైపు కదులుతోంది. దీనివల్ల ఏపీ మరియు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రజలు చెట్ల కింద, హోర్డింగ్స్ మరియు విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

