ఆక్వా రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు

ఏలూరు జిల్లా ముదినేపల్లి:::: భారత్ డిజిటల్ న్యూస్ ప్రతినిధి:::: కైకలూరు నియోజకవర్గం మదినేపల్లిలో గల కొడాలి వినోద్ టిడిపి పార్టీ కార్యాలయం వద్ద కూటమి నాయకులు మరియు ఆక్వా రైతులు ప్రెస్ మీట్ నిర్వహించారు కొడాలి వినోద్ మాట్లాడుతూము ఆక్వా గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదు అని విమర్శించారు. కోటప్రోలు కృష్ణ మాట్లాడుతూ
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అప్పట్లో వారి సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. టిడిపి నాయకులు వీరమల్లు నరసింహారావు మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ఆక్వా రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటోందని, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే రాజకీయ విమర్శల కంటే ఆక్వా రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆక్వా రైతులు పాల్గొని గత ప్రభుత్వం కన్నా ప్రస్తుత ప్రభుత్వం ఆక్వా రైతుల సమస్యలను తెలుసుకుని అన్ని రకాలుగా సహాయ సహకారాలు ప్రభుత్వ అందిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి జనసేన టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు