భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ..56 ఏళ్ల యువకుడి గురించి కాదు.. రాహుల్‌పై మోదీ పరోక్ష వ్యాఖ్యలు..
పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ స్కైరూట్ ఏరోస్పేస్ బృందాన్ని ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ బృందంలోని సభ్యుల సగటు వయసు 28 ఏళ్లు అని పేర్కొంటూ.. “నేను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదు” అంటూ పరోక్షంగా సెటైర్ వేశారు. యువత ప్రతిభకు అంతరిక్షమే హద్దు అని, వారు ప్రపంచానికి తమ సత్తా చాటారని మోదీ కొనియాడారు

