పీలేరు రోడ్డు మార్గంలో 11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..పీలేరు రోడ్డు మార్గంలో 11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

  • ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు
  • ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న కారు సీజ్
    పీలేరు రోడ్డు మార్గంలో కారులో తరలిస్తున్న 11ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లును అరెస్టు చేసి, వారు అక్రమ రవాణాకు ఉపయోగించిన కారును సీజ్ చేశారు.

టాస్క్ ఫోర్స్ హెడ్ సుబ్బారాయుడు కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏఎస్పీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో డీఎస్పీ శ్రీ ఎండీ షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో ఏఆర్ఎస్ఐ కె. మహేశ్వర నాయుడు టీమ్ స్థానిక అటవీ సిబ్బంది జగదీష్, ఆషా బీ లతో కలసి కేవీ పల్లి – పీలేరు మార్గంలో పొంతల చెరువు క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. సోమవారం తెల్లవారు జామున ఒక కారు వేగంగా రాసాగింది. అయితే టాస్క్ ఫోర్స్ టీమ్ ను గమనించిన కారులోని వ్యక్తులు కారును ఆపి, దిగి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని వెంబడించి ఇద్దరిని పట్టుకోగలిగారు. కాగా మరో వ్యక్తి పారిపోయాడు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు తమిళనాడు తిరుపత్తూరు, తిరువన్నామలై జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. తరువాత కారును తనిఖీ చేయగా అందులో 11ఎర్రచందనం దుంగలు కనిపించాయి. దుంగలు, కారుతో సహా పట్టుబడిన వారిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన వారిని డీఎస్పీ వీ.శ్రీనివాసులు రెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్ విచారించారు. ఈ కేసును సీఐ ఖాదర్ బాషా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.