భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త ఆరోగ్య భరోసా.. EHS పథకం ప్రారంభం..

Ammiraju Udaya Shankar.sharma News Editor…తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం నూతన ఆరోగ్య పథకం (EHS)ను ప్రారంభించింది. సచివాలయంలో హెల్త్ పోర్టల్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉద్యోగులకు కొత్త హెల్త్ కార్డులను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 886 ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
EHS ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు వేగవంతమైన, పారదర్శకమైన వైద్య సేవలు అందించడంతో పాటు మెరుగైన ఆరోగ్య భద్రత కల్పించనున్నారు.

