భారత్ న్యూస్ విజయవాడ…5 ఏళ్ళ నీ దరిద్రిపు పాలనలో, 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి, ప్రజల నడ్డి విరిచిన నువ్వు, విద్యుత్ చార్జీల గురించి మాట్లాడుతున్నావా జగన్ ? ఈఆర్సీ తాజాగా చేసిన ప్రతిపాదన నీ పాపం కాదా ? తల్లికి అన్యాయం చేసినట్టు, 5 ఏళ్ళు ప్రజలతో ఆడుకున్నావ్. నీ పాపాలు, శాపాలుగా మారి ప్రజలను వెంటాడుతున్నాయి. ఈ సర్దుబాటు చార్జీల పాపం కచ్చితంగా నీ దరిద్రపు పాలనదే. 2022-23లో విద్యుత్ కొనుగోలు భారాన్ని, ఇప్పుడు విద్యుత్ చార్జీలు పెంచేలా ఈఆర్సీ ప్రతిపాదించింది. ఈ ప్రాసెస్ అంతా జరిగింది నీ హయాంలోనే అనే విషయం మర్చిపోయావా ? 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత ఎఫ్‌పీపీసీఏ ఆధారంగా యూనిట్‌కు అదనంగా రూ.1.27 చార్జీ విధించాలని డిస్కమ్‌లు ఆ రోజే అడిగాయి. ఎఫ్‌పీపీసీఏ ద్వారా విద్యుత్ కొనుగోలు ఖర్చులను తగ్గించేందుకు నాడు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనకు ఏపీఈఆర్‌సీ 2023లోనే సమీక్ష అనంతరం ఆమోదం తెలిపింది. ప్రజలపై రూ.6,072.86 కోట్ల భారం మోపండని 2023లో ఈఆర్సీకి చెప్పింది నువ్వే కదా జగన్, మర్చిపోయావా ? ఎన్నికల ఏడాది కూడా చార్జీలు పెంచితే ప్రజలు ఊస్తారని, నీ ప్రభుత్వంలో వడ్డించాల్సిన చార్జీలను వాయిదా వేసింది నువ్వు కదా జగన్ ? జగస్ రెడ్డి హయాంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతోనే నేడు ప్రజలపై విద్యుత్ సర్దుబాటు చార్జీల భారంగా మారాయి. కమిషన్ నిర్ణయం ఆలస్యం కారణంగా ఆ మొత్తం భారం కూటమి ప్రభుత్వంలో కట్టాల్సిన వస్తోంది విద్యుత్ రంగంలో దోచుకోవటానికి నాడు అక్రమ విద్యుత్ కొనుగోళ్లు చేసి, పీపీఏల రద్దు చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం. ఏపీ జెన్కో లో విద్యుదుత్పత్తిని తగ్గించి, జగన్ రెడ్డి బినామీ కంపెనీల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసారు. విద్యుత్ ను అధిక ధరలకు కొనుగోలు చేసి, దోచుకున్నది జగన్ రెడ్డి ముఠా. మార్కెట్ లో యూనిట్ రూ.3-4కి దొరుకుతుంటే, యూనిట్ రూ.12 పెట్టి మరీ త