తల్లికి వందనం’ కోసం దేవదాయ శాఖ నిధులు.. ఉత్తర్వులు జారీ

Jul 20, 2026,

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..‘తల్లికి వందనం’ కోసం దేవదాయ శాఖ నిధులు.. ఉత్తర్వులు జారీ

Jul 20, 2026,

‘తల్లికి వందనం’ కోసం దేవదాయ శాఖ నిధులు.. ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ‘తల్లికి వందనం’ లబ్ధిదారులకు చెల్లించేందుకు దేవదాయ శాఖ నుంచి రూ.26.03 కోట్లు విడుదల చేసేందుకు పరిపాలన అనుమతులిస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్రహ్మణ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే తల్లికి వందనం లబ్ధిదారులకు డబ్బులు చెల్లించేందుకు ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు సంబంధించి పీడీ అకౌంట్‌లో నిధులు జమ చేసేందుకు దేవదాయ శాఖ కమిషనర్ తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, ఈ నెల 22 నుంచి తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ చేయనున్న విషయం తెలిసిందే.