భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..అవినీతికి పాల్పడితే రెండో ఛాన్స్ ఉండదు : తమిళనాడు సీఎం విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అవినీతిపై తన మంత్రులకు, ప్రభుత్వ యంత్రాంగానికి గట్టి హెచ్చరిక చేశారు. తన ప్రభుత్వంలో అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారికి ఎలాంటి రెండో అవకాశం ఉండదని గురువారం ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ అవినీతిపై జీరో టోలరెన్స్ విధానాన్ని మరోసారి ప్రకటించారు.

