భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..గూగుల్ మ్యాప్స్ సరికొత్త 3D నావిగేషన్ ఫీచర్
గూగుల్ మ్యాప్స్ ఆండ్రాయిడ్ ఆటో వినియోగదారుల కోసం సరికొత్త ‘ఇమ్మర్సివ్ నావిగేషన్’ ఫీచర్ను దశలవారీగా విడుదల చేస్తోంది. ఈ అప్డేట్తో రోడ్లు, ఫ్లైఓవర్లు, భవనాలు, చెట్లు త్రీడీ (3D) రూపంలో స్పష్టంగా కనిపిస్తాయి. సంక్లిష్టమైన జంక్షన్ల వద్ద మ్యాప్ ఆటోమేటిక్గా జూమ్ అవుతూ సరైన మార్గాన్ని సూచిస్తుంది. ఇది సర్వర్-సైడ్ అప్డేట్ కావడంతో ప్రస్తుతం భారత్, అమెరికా వంటి దేశాల్లో కొద్దిమందికే అందుబాటులోకి వచ్చింది. తెలియని ప్రాంతాల్లో ప్రయాణించే వారికి, రద్దీ నగరాల్లో డ్రైవ్ చేసే వారికి ఈ త్రీడీ విజువల్స్ నావిగేషన్ ఎంతో సులభతరం కానుంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది

