భారత్ న్యూస్ విజయవాడ…కేంద్రంలో పదేళ్ల ఎన్డీఏ పాలనలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పలు పురస్కారాలను అందుకున్నారు.

ఇప్పటికే పలు దేశాలు ఆయా దేశాల పౌరపురస్కారాలతో సత్కరించింది.

తాజాగా ఈ రోజు .. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మరో అరుదైన గౌరవం లభించింది.

కామన్వెల్త్‌ ఆఫ్‌ డొమినికా ఆ దేశ అత్యున్నత జాతీయ అవార్డును ప్రకటించింది.

ఈ మేరకు ఆ ప్రభుత్వం ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేసింది.

కొవిడ్‌ సమయంలో డొమినికాకు భారత్‌ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపింది.