ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపుల తో వివాహిత ఆత్మహత్యాయత్నం

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..బ్రేకింగ్ న్యూస్

కృష్ణాజిల్లా

అవనిగడ్డ నియోజకవర్గం

అవనిగడ్డలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపుల తో వివాహిత ఆత్మహత్యాయత్నం

ఉత్తర చిరువోలు లంక గ్రామానికి చెందిన దాసి ధనలక్ష్మి (37) ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులతో నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం

ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కు సంబంధించిన ఫైనాన్స్ కంపెనీలో ఇల్లు తనకా పెట్టి లోన్ తీసుకున్నామని కట్టవలసిన లోన్ 40 వేలు బాకీ ఉండగా కడతామని చెప్పిన వినకుండా ఫైనాన్స్ కంపెనీ వారు ఇంటికి వచ్చి దౌర్జన్యానికి పాల్పడటమే కాక మహిళను దుర్భాషలాడటంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపణ

నోటీసులు ఇచ్చి కూడా రాత్రి సమయంలో ఇంటికి వచ్చి మహిళపై దుర్భాషలాడి దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు

అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న బాధితురాలు

ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన మేనేజర్ అనిల్ తో పాటు తమ ఇంటికి వచ్చి వారిని ఇబ్బంది పెట్టిన మిగతా సిబ్బందిపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న కుటుంబ సభ్యులు

ఫైనాన్స్ వారీ వేధింపుల నుంచి మాకు రక్షణ కల్పించాలంటూ పోలీస్ వారిని వేడుకుంటున్న కుటుంబ సభ్యులు

జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.