విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత వైసీపీకి దక్కుతుంది:-మంత్రి గొట్టిపాటి రవి

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..కృష్ణాజిల్లా

విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత వైసీపీకి దక్కుతుంది:-మంత్రి గొట్టిపాటి రవి

పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని యనమలకుదురు గ్రామంలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ కు మంత్రి గొట్టిపాటి రవి శంకుస్థాపన చేశారు

అనంతరం పెదపులిపాక గ్రామంలో నిర్మించిన 33/11 కె.వి నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు

పెదపులిపాక దళితవాడలో సూర్య ఘర్ పధకం కింద 80 కుటుంబాలకు సోలార్ ప్యానల్లను ప్రారంభించారు

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్, విద్యుత్ సిఎండి పుల్లారెడ్డి కూటమి నాయకులు పాల్గొన్నారు

మంత్రి గొట్టిపాటి రవి మాట్లాడుతూ..

కూటమి ప్రభుత్వ ఏర్పడినాక ఒక పెనమలూరు నియోజకవర్గం లో మూడు సబ్ స్టేషన్లు ప్రారంభించామని తెలిపారు

మరో రెండు సబ్ స్టేషన్ లు పనులు జరుగుతున్నాయని తెలిపారు

గ్రామాలకు 24 గంటలు వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్ అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు

ప్రతి ఇంటిపై సోలార్ పెట్టుకునే విధంగా అందరూ కృషి చేయాలి అన్నారు

దేశం మొత్తం మీద కోటి సోలార్ కనెక్షన్లు టార్గెట్ ఉంటే ఒక్క ఆంధ్రాలో 20 లక్షల కనెక్షన్లు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు అన్నారు

ఎస్సీలకు ఈ పథకం ప్రభుత్వం ఇస్తున్న విధంగా త్వరలోనే బీసీలకు కూడా వర్తింప చేస్తామన్నారు

గత వైసిపి ప్రభుత్వం ఒక్క సబ్ స్టేషన్ కూడా నిర్మించలేదన్నారు

విద్యుత్ అధిక ధరకు కొనుగోలు చేసి ప్రజలపై విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విచారణ

గడచిన ఐదేళ్లలో పదిసార్లు విద్యుత్ ఛార్జీలు వైసిపి ప్రభుత్వం పెంచింది అన్నారు

కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మనమే విద్యుత్ అందించే విధంగా సోలార్ పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లామని తెలిపారు