భారత్ న్యూస్ఏలూరు జిల్లా కైకలూరు:::::: “జాతిపిత గాంధీ జాడేది”మళ్లి గాంధిజీ ని చూస్తామా” ప్రశ్నార్థకంగా అదృశ్యం ఐన జాతిపిత విగ్రహం పై ప్రజల మదిలో పలు అనుమానాలు కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లిలో గల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం అదృశ్యంపై అనుమానాలు వ్యక్తపరుస్తున్న గాందేయవాదులు ముదినేపల్లి లో గల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం జాతీయ రహదారి మరమత్తు నిమిత్తం జాతిపిత గాంధీజీ మండపాన్ని, విగ్రహాన్ని తొలగించి రహదారి మరమ్మతులు జరిపిన పిదప పక్కకు తొలగించబడిన జాతిపిత గాంధీ విగ్రహం అంచలంచలుగా జరుపుకుంటూ కైకలూరు రోడ్ లో గల ఆంజనేయ స్వామి గుడి ముందు గలిగిన పార్కులోకి చేర్చబడిన విగ్రహం గత కొన్ని సంవత్సరాలుగా కనిపించకుండా పోవుట చేత ప్రజలు పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారని ఉప్పు సత్యాగ్రహ సమయమందు గాంధీజీ ముదినేపల్లి లో ఒక రాత్రి బస చేశారని ఆనాడు ముదినేపల్లి వచ్చిన గాంధీజీని స్ఫూర్తిగా గాంధీయవాదులు తీసుకుని గాంధీజీ విగ్రహాన్ని నిర్మించారని చాలాకాలం గాంధీజీ మండపం వద్దనే బస్టాండ్ నిర్వహించారని ప్రస్తుతం గాంధీజీ విగ్రహం కనిపించడం లేదని పలు పలు,సార్లు పత్రికా కథనాలలో ప్రచురించిన కూడా అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోలేదని ఇప్పటికైనా అధికారులు కనపడకుండా పోయిన గాంధీజీ విగ్రహం పై విచారణ జరిపించాలని ముదినేపల్లి నడిబొడ్డులో గాంధీజీ విగ్రహానికి స్థలం కేటాయించి ప్రభుత్వ ఖర్చుతో గాంధీజీ మండపాన్ని నిర్మించి గాంధీజీ విగ్రహాన్ని పునర్ నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని రాబోవు భవిష్యత్తు తరాలకు తెలిసేలా చరిత్ర పుటల్లో ముదినేపల్లి లో గాంధీజీ విగ్రహాన్ని పునర్ నిర్మించాలని కనిపించని గాంధీ విగ్రహంపై విచారణ జరిపించి శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ముదినేపల్లి ప్రజలు జాతీయ రహదారి విస్తరణ అధికారులు తొలగించిన గాంధీజీ విగ్రహాన్ని గాంధీజీ విగ్రహాన్ని ఏం చేశారో అని అనుమానం వ్యక్తపరుస్తూ జాతీయ రహదారి విస్తరణ అధికారులుచేత తొలగించబడిన విగ్రహం పై పూర్తి విచారణ జరిపించాలని మరల గాంధీజీ విగ్రహాన్ని భర్తీ చేస్తూ ఏర్పాటు చేయించడానికి మండలంలోని వివిధ శాఖలకు సంబంధించిన మండలాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మరలా ముదినేపల్లి నడిబొడ్డులో గాంధీజీ విగ్రహాన్ని పునర్ నిర్మించాలని ప్రజల కోరుతున్నారు

