స్టైపెండ్‌కు హాజరు తప్పనిసరి.. డీఎంఈ కీలక ఆదేశాలు

భారత్ న్యూస్ హైదరాబాద్ …స్టైపెండ్‌కు హాజరు తప్పనిసరి.. డీఎంఈ కీలక ఆదేశాలు

ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో పనిచేసే సీనియర్, జూనియర్ రెసిడెంట్లు, ఇంటర్న్‌ల స్టైపెండ్‌ల చెల్లింపులను క్రమబద్ధీకరిస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇకపై ప్రతి నెలా సక్రమంగా స్టైపెండ్ అందేలా కొత్త హాజరు నిబంధనను ప్రవేశపెట్టింది. ప్రస్తుత జులై నెల స్టైపెండ్ కోసం ఈ నెల 1 నుండి 20 వరకు ఉన్న హాజరు వివరాలు, అలాగే ప్రతి నెలా 21వ తేదీ నుంచి మరుసటి నెల 20వ తేదీ వరకు ఉన్న హాజరు వివరాలను నివేదించాలని కాలేజీ ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లను డీఎంఈ ఆదేశించింది.