సీఎం చంద్రబాబుకు తెలంగాణ లారీ ఓనర్స్‌ సంఘం హెచ్చరిక

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..సీఎం చంద్రబాబుకు తెలంగాణ లారీ ఓనర్స్‌ సంఘం హెచ్చరిక

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ స్టేట్‌ లారీ ఓనర్స్‌ సంఘం నాయకులు బుధవారం లేఖ రాశారు.

సింగిల్‌ పర్మిట్‌ విధానాన్ని అమలు చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఏపీలోకి లారీ వెళితే రూ. 1500 ఫైన్‌ వేస్తున్నారని, సింగిల్‌ పర్మిట్‌ ఇవ్వాలని ఎన్నిసార్లు డిమాండ్‌ చేసినా పట్టించుకోవడం లేదని సంఘం అధ్యక్షుడు సూర్వి యాదయ్యగౌడ్‌ పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య గూడ్స్‌ వాహనాలకు కౌంటర్‌ సిగ్నేచర్‌ పర్మిట్‌ (సింగిల్‌ పర్మిట్‌) విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో 2 లక్షలకు పైగా లారీలు ఉన్నాయని, వాటిలో 80 శాతం స్టేట్‌ పర్మిట్‌ ఉన్నవేనని తెలిపారు.