భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..ధరణి’ అక్రమాలపై సిట్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం!
తెలంగాణ :
ధరణి పోర్టల్ ద్వారా భూ అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది.
పలు జిల్లాల్లో వెలుగుచూసిన భూ యాజమాన్య మార్పులు, ప్రభుత్వ భూముల అక్రమ బదిలీలు, సాంకేతిక లోపాల దుర్వినియోగం వంటి అంశాలపై లోతైన విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సిట్‌లో రెవెన్యూ, పోలీస్, సైబర్ క్రైమ్, ఐటీ శాఖల అధికారులు ఉంటారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన 2020 సంవత్సరం నుంచి జరిగిన అనుమానాస్పద భూ లావాదేవీలను సిట్ పరిశీలించనుంది.
