ఉమ్మడి చిత్తూరు జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా మస్తాన్ భాష…..ఏఐసీసీ సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్

ఉమ్మడి చిత్తూరు జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా మస్తాన్ భాష…..ఏఐసీసీ సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్

(భారత్ డిజిటల్ న్యూస్ ) 09/07/2026 తిరుపతి జిల్లా పాకాల,తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం హసన్ పురంకు చెందిన పఠాన్ మస్తాన్ భాషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ వైస్.షర్మిల రెడ్డి ఆదేశాలతో చిత్తూరు ఉమ్మడి జిల్లా డిసిసి వైస్ ప్రెసిడెంట్ గా మరలా ఎన్నుకోవడం జరిగిందని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్,ఆంధ్రప్రదేశ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.మస్తాన్ వలి లు గురువారం పత్రికా ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పటాన్ మస్తాన్ భాష మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చినందుకు,రావడానికి కృషి చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే జిల్లా డిసీసీ ప్రెసిడెంట్ రమేష్ బాబు పదవి రావడానికి సహకారాలు అందించారని చెప్పారు.అనంతరం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్,ఆంధ్రప్రదేశ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.మస్తాన్ వలి లను శ్యాలువ కప్పి సన్మానించారు.చిత్తూరు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని చెప్పారు.