రెవెన్యూ శాఖ అధికారులపై హైకోర్టు అసహనం!

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..రెవెన్యూ శాఖ అధికారులపై హైకోర్టు అసహనం!

తెలంగాణ :

రెవెన్యూ శాఖ అధికారులపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

తన 20 గుంటల భూమిని ఆర్డీవో, తహసీల్దార్ మ్యుటేషన్ చేయడంలేదని నిజామాబాద్(D) బోధన్(M) ఎరాజ్ పల్లెకు చెందిన లోకనడిపి హనుమాండ్లు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

ఈ పిటిషన్ విచారిస్తూ ప్రజలు అప్లికేషన్లు పెట్టుకుని నెలలు గడుస్తున్నా భూ సర్వేలు, మ్యుటేషన్లు, పాస్ పుస్తకాలు జారీ చేయకపోవడం లాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొంది.

హైకోర్టు చెప్పకపోతే మీ పని మీరు చేయలేరా? ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ, కేసును 4 వారాలకు వాయిదా వేసింది.