భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ప్రభుత్వ విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు, ఉపాధ్యాయుల అంకితభావంతోనే ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు..

Ammiraju Udaya Shankar.sharma News Editor…ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని, ఈ ఏడాది ఏకంగా 1.06 లక్షల మంది కొత్త విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరడం సంతోషకరమన్నారు. ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైనా ఉందని తెలిపారు.. ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.. ప్రొద్దుటూరు దొరసానిపల్లి ప్రభుత్వ జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.

