భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..రాజధాని రైతుల రుణమాఫీకి ఏపీ కేబినెట్ ఆమోదం..ఏపీ కేబినెట్ సమావేశం నిర్ణయాలు.. హైలెట్స్

Ammiraju Udaya Shankar.sharma News Editor…గ్రామాల్లో రూ.9,355 కోట్లతో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కు మంత్రివర్గం ఆమోదం.
విశాఖలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు క్యాబినెట్ అనుమతి.
రూ.50 కోట్లతో పర్యాటక ప్రచారానికి మంత్రివర్గం ఆమోదం.
నెల్లూరులోని ఐటీసీ హోటల్, కడపలో మాధవి హోటల్, విజయవాడలో సరోవర్ పోర్టికో హోటల్ కు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు క్యాబినెట్ అంగీకారం.
రాజధాని అమరావతిలో రెండో విడతకు భూములు ఇచ్చే 7 గ్రామాల రైతులకు రూ. లక్షన్నర వరకు రుణమాఫీకి మంత్రివర్గం ఆమోదం.
2026 జనవరి 6 కంటే ముందు తీసుకున్న రుణాలకు దీన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు.
కడపలో ఇంటిగ్రేటెడ్ అమ్యూజ్మెంట్ పార్కుకు ఆమోదం.
విశాఖ, గుంటూరు, నెల్లూరులో అంబేడ్కర్ గురుకుల సీవోఈ ఏర్పాటుకు అంగీకారం.
ఐఐటీ జేఈఈ, నీట్ రెసిడెన్షియల్ కోచింగ్ ప్రతిపాదనలకు ఆమోదం.
పెద్దగెడ్డ రిజర్వాయర్ కమాండ్ ఏరియా ఆధునికీకరణకు అనుమతి.
కుప్పంలో ఫీడర్ ఛానెల్స్, బీరగానిపల్లె రిజర్వాయర్ కు ఆమోదం.

సీఆర్డీఏ ఆమోదించిన సంస్థలకు భూకేటాయింపులకు గ్రీన్ సిగ్నల్.
