భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.వియాత్నాం పడవ ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర
గెల్లి కిశోర్‌కు మెరుగైన వైద్యం అందుతోందని, ఆందోళన చెందొద్దని భరోసా
మొగల్రాజపురంలో గెల్లి కిషోర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మంత్రి కొల్లు రవీంద్ర
వియాత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన గెల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను మంత్రి కొల్లు రవీంద్ర కలిసి ధైర్యం చెప్పారు. గెల్లి కిశోర్‌కు వియాత్నాంలో మెరుగైన వైద్యం అందుతోందని, ఆందోళన చెందొద్దని వారి పిల్లలను కలిసి భరోసా ఇచ్చారు. విజయవాడలోని మెగల్రాజపురంలో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వియాత్నాంలో కిశోర్‌కు సహాయంగా వెళ్లిన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రేపు సాయంత్రానికి జయశ్రీ భౌతిక కాయం విజయవాడ రానుందని, మంగళవారం కుటుంబ సభ్యులకు అందిస్తామని అధికారులు చెప్పినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఘటన గురించి ఇప్పటికే మంత్రి నారా లోకేశ్ గారు ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరిపారని, అన్ని రకాలుగా తోడుగా ఉంటామని మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు..

