భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..జీవిత భాగస్వామి ఫోన్ కాల్స్‌ను రహస్యంగా రికార్డ్ చేయడం చట్టవిరుద్ధం – తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భార్య లేదా భర్త అనుమతి లేకుండా వారి ఫోన్ సంభాషణలను రహస్యంగా రికార్డ్ చేయడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద కల్పించిన వ్యక్తిగత గోప్యత (Right to Privacy) హక్కును ఉల్లంఘించడమే అని స్పష్టం చేసింది.
అంతేకాకుండా, ఇలాంటి రహస్య ఆడియో రికార్డింగ్స్‌ను విడాకుల (Divorce) కేసులు లేదా ఇతర వైవాహిక వివాదాల విచారణలో సాక్ష్యంగా (Evidence) స్వీకరించలేమని హైకోర్టు పేర్కొంది.
