రైలు బోగీలో పూజారి ఆధ్వర్యంలో మతపరమైన పూజలు నిర్వహించిన

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…బోగీలో పూజలు.. రైల్వే శాఖ వివరణ
రైలు బోగీలో పూజారి ఆధ్వర్యంలో మతపరమైన పూజలు నిర్వహించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే నిబంధనలపై చర్చ నెలకొంది..

దీనిపై స్పందించిన నార్తర్న్ రైల్వే.. ఆ వీడియో సాధారణ ప్రయాణికుల కోచ్‌కు సంబంధించినది కాదని, ప్రైవేట్‌గా బుక్ చేసిన సెలూన్ కార్‌లో చిత్రీకరించిందని తెలిపింది. ప్రత్యేకంగా బుక్ చేసుకున్న కోచ్‌లలో వ్యక్తిగత కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది..