సింగరేణికి 11 ఏళ్ల తర్వాత కొత్త బొగ్గు గని కేటాయింపు…

భారత్ న్యూస్ కరీంనగర్ …..సింగరేణికి 11 ఏళ్ల తర్వాత కొత్త బొగ్గు గని కేటాయింపు…

కేంద్ర ప్రభుత్వం భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను నేరుగా సింగరేణికి కేటాయించింది. 11 ఏళ్ల తర్వాత సింగరేణికి దక్కిన ఈ కొత్త గనిలో 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. ఇది సుమారు 30-40 ఏళ్ల వరకు ఉత్పత్తికి అవకాశం కల్పిస్తుంది. ఈ కేటాయింపుతో సుమారు 2 వేల మందికి ఉపాధి లభిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలు, కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వివేక్ వెంకటస్వామి, సీఎం రేవంత్ రెడ్డిల చొరవతో ఈ కేటాయింపులు జరిగాయి….