భారత్ న్యూస్ విజయవాడ…జనసేనలో చేరిన శ్రీ గుడిపాటి సీతారామ్

Ammiraju Udaya Shankar.sharma News Editor…విజయవాడ నగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త శ్రీ గుడిపాటి సీతారామ్ జనసేన పార్టీలో చేరారు.
మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని శ్రీ సీతారామ్ కలసి పార్టీలో చేరుతానని కోరారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో శ్రీ సీతారామ్ సతీమణి, యువ గాయని శ్రీమతి శ్రీలలిత పాల్గొన్నారు.

‘నేషన్ ఫస్ట్ అనే దృక్పథం కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అడుగులు వేయాలనే ఉద్దేశంతో జనసేనలో చేరాను. పార్టీ సిద్ధాంతాలకు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తాను’ అని ఆయన చెప్పారు…..