భారత్ న్యూస్ శ్రీకాకుళం….పేటలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ పర్యటన
చిలకలూరిపేట పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వివేక్ యాదవ్ తెలిపారు. ఈ రోజు చిలకలూరిపేట అర్బన్, కృష్ణానగర్‌లోని మునిసిపల్ ఎలిమెంటరీ స్కూల్ (పోలింగ్ బూత్ నెం. 141) ను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు 100 శాతం పూర్తయిందని, డిజిటైజేషన్ ప్రక్రియ నేటికి 62 శాతం పూర్తయిందని వెల్లడించారు. జూలై 14వ తేదీ నాటికి ఈ డిజిటైజేషన్ పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించినట్లు ఆయన తెలిపారు. ఓటర్లు ఎవరైనా ఇంటి వద్ద అందుబాటులో లేకపోతే, వారి తరపున బంధువులు ఆ ఫారం నింపి ఇవ్వవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే, బీఎల్ఓ (BLO)లను సులభంగా సంప్రదించడానికి ‘ECI నెట్’ యాప్‌లో ‘బుక్ యువర్ కాల్ విత్ BLO’ అనే ప్రత్యేక సదుపాయం ఉందని, ఓటర్లు దీనిని వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం రాజకీయ పార్టీల బీఎల్ఏ (BLA)లు కూడా ఈ రివిజన్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు…
