భారత్ న్యూస్ విశాఖపట్నం..ఎన్‌టీఆర్ జిల్లా..
విజయవాడ..
విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్‌ఐఏ సోదాలు
విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వించిపేటలో తెల్లవారుజాము నుంచి ఎన్‌ఐఏ (NIA) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
వించిపేట గాంధీ బొమ్మ సెంటర్‌లోని ఓ నివాస గృహంలో ఎన్‌ఐఏ బృందం తనిఖీలు చేపట్టింది.
స్థానిక పోలీసుల సహకారంతో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.

ఎన్‌ఐఏ అధికారులు పలు పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనతో వించిపేట ప్రాంతంలో స్థానికంగా ఆసక్తి నెలకొంది.