భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ..భారీ వర్షాలతో కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ …..
ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కేదార్నాథ్ యాత్ర మార్గాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
రుద్రప్రయాగ్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చౌడీ సమీపంలోని ట్రెక్కింగ్ మార్గం తీవ్రంగా దెబ్బతింది.
ముందస్తు జాగ్రత్తగా, యాత్రికుల రాకపోకలను వైఎమ్ఎఫ్ (YMF) బృందాలు నిలిపివేశాయి. దెబ్బతిన్న రోడ్డు పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తంగా ఉన్నారు….
