ఖైరతాబాద్ బడా గణనాథుడి నిమజ్జనానికి భారీ టస్కర్ సిద్ధం….

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఖైరతాబాద్ బడా గణనాథుడి నిమజ్జనానికి భారీ టస్కర్ సిద్ధం….

తెలంగాణ : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణనాథుడి నిమజ్జనోత్సవానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 69 అడుగుల ఎత్తు, 40-50 టన్నుల బరువున్న విగ్రహాన్ని తరలించడానికి విజయవాడ నుంచి 26 చక్రాలు, 100 టన్నుల సామర్థ్యం గల భారీ టస్కర్‌ను రప్పించారు.

గురువారం అర్ధరాత్రి విగ్రహాన్ని టస్కర్‌పై అమర్చి, శుక్రవారం (సెప్టెంబర్ 25) ఉదయం శోభాయాత్ర ప్రారంభించి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు….