తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు సంచలన ఆరోపణలు చేశారు

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు సంచలన ఆరోపణలు చేశారు.

తనపై కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆరోపించారు.

సిద్ధాంతి వ్యాఖ్యల తర్వాతే తన మిత్రుడు ఆస్పత్రిలో చేరాడని బొలిశెట్టి పేర్కొన్నారు. ఒక మనిషి చనిపోవాలని పూజలు చేయించడం ఎంతవరకు కరెక్ట్.క్షుద్ర పూజలు చేసి తనను చంపాలని చూస్తున్నారన్నారు.

ప్రాణాలతో చెలగాటం ఆడటం మంచిది కాదని, ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి రాజకీయంగా ఎదుర్కోవాలని బొలిశెట్టి శ్రీనివాస్ గారు సవాల్ విసిరారు.

వైసీపీ పార్టీ లో వున్నా మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ కూడా నన్ను ఏ రోజు ఒక్క మాట అనలేదు నేను విమర్శలు చేయలేదు…