ఏడేళ్ళు పూర్తయినా.. ఏదారీ లేకుండా ఉన్నాం

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఏడేళ్ళు పూర్తయినా.. ఏదారీ లేకుండా ఉన్నాం

మహాత్మునికి నియోజకవర్గ సచివాలయ ఉద్యోగుల మొర

చల్లపల్లిలో గాంధీ మహాత్మునికి వినతి పత్రం సమర్పించిన ఉద్యోగులు

చల్లపల్లి:
ఉద్యోగంలో చేరి ఏడేళ్ళు పూర్తయినా… ఏదారీ లేకుండా ఆనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామని తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ జాతిపిత మహాత్మాగాంధీజికి స్వర్ణగ్రామ సచివాలయ ఉద్యోగులు మొరపెట్టుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు సచివాలయాలకు చెందిన ఉద్యోగులు శుక్రవారం చల్లపల్లిలోని మహాత్ముని విగ్రహం వద్దకు చేరుకుని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ఏర్పడి నేటికి ఏడేళ్ళు పూర్తయినా ఇప్పటి వరకూ ఎటువంటి ఎదుగూబొదుగూ లేకుండా ఎక్కడ వేసిన గొంగలి ఆక్కడే ఆన్నట్లుగా కొట్టుమిట్టాడుతున్నామని ఆవేధన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ సెప్టెంబర్ 27వ తేదీన చలో విజయవాడకు వెళ్లిన 46 మందిపై అక్రమ కేసులు పెట్టడం ఆన్యాయమన్నారు. వెంటనే ఆక్రమ కేసులు ఎత్తివేసి, సస్పెండ్ చేసిన సచివాలయ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. తమకు న్యాయంగా రావాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లను మంజూరు చేయాలని, కనీసం మూలవేతనం రూ.30000లకు తగ్గకుండా స్పష్టమైన ప్రమోషన్ చానల్ కల్పించాలని కోరారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఇవ్వాల్సిన అన్ని ప్రయోజనాలను మూడు నెలల్లోపు ఇచ్చి అర్హత మేరకు కారుణ్య నియామక ప్రక్రియను కూడా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
బిఎల్వో విధులను సచివాలయ ఉద్యోగులకు మాత్రమే కాకుండా అర్హత ఉన్న ఇతర శాలకు కూడా సమానంగా కేటాయించాలని, స్వర్ణగ్రామ ఉద్యోగులపై ఆధనపు పని భారం పెంచుతున్న డిప్యుటేషన్లను వెంటనే రద్దు చేయాలని కోరారు. ప్రొబేషన్ ఆలస్యమైన తొమ్మిది నెలల కాలానికి బకాయిలు మంజూరు చేయాలని. జి.ఎం.ఎస్ నెం.11ను వెంటనే రద్దు చేయాలని, సర్వీసు, ఉద్యోగ ఆర్థిక సంబంధిత సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్చలు నిర్వహించి పరిష్కరించాలని కోరుతూ తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మహాత్మునికి సమర్పించి తమ మొర విన్నవించుకున్నారు.