ఇంద్రకీలాద్రిపై దసరా ప్రదర్శనలకు దరఖాస్తుల ఆహ్వానం

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఇంద్రకీలాద్రిపై దసరా ప్రదర్శనలకు దరఖాస్తుల ఆహ్వానం

విజయవాడ :

విజయవాడ ఇంద్రకీలాద్రిపై 2026 అక్టోబర్ 11 నుండి 20 వరకు ఘనంగా జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనల కోసం ఆలయ అధికారులు కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసక్తి గల కళాకారులు అక్టోబర్ 5వ తేదీలోపు తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఈ దరఖాస్తులను పోస్ట్, ఈ-మెయిల్ ద్వారా లేదా నేరుగా కార్యాలయంలో అందజేయవచ్చని అధికారులు పేర్కొన్నారు.