భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఈ ఏడాది దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కుదుర్చుకున్న మరో ఒప్పందం సాకారం.

Ammiraju Udaya Shankar.sharma News Editor.ఆంధ్రప్రదేశ్ లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
•రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయిన యూఏఈ ఆర్ధిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ
•ఆంధ్రప్రదేశ్లో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో యుఏఈ ప్రతినిధుల బృందం చర్చలు
•ఈ ఏడాది సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసిన యూఏఈ
•ఆహార శుద్ధి రంగంలో ఏపీలో వ్యాల్యూచైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన యూఏఈ
•ఈమేరకు ఏపీ ప్రభుత్వం- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య భాగస్వామ్యం ఏర్పాటు
•మామిడి, అరటి, కోకో సహా వివిధ ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు పంపేలా వాల్యూ చైన్ ఏర్పాటుకు నిర్ణయం
•భేటీలో పాల్గొన్న యూఏఈ దేశ ప్రతినిధుల బృందం, మంత్రి టీజీ భరత్, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు, ఈడీబీ ఉన్నతాధికారులు.

