పొగాకు రైతులకు అన్యాయం.. జగన్ తీవ్ర విమర్శలు

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…పొగాకు రైతులకు అన్యాయం.. జగన్ తీవ్ర విమర్శలు

Ammiraju Udaya Shankar.sharma News Editor…పొగాకు ఎగుమతిదారులు ఎక్స్‌పోర్ట్ ఆర్డర్లు లేవంటూ రైతులను మోసం చేస్తున్నారని, ఆర్డర్లు లేకుండానే 142 మిలియన్ కిలోలకు ఇండెంట్ ఎలా ఇచ్చారని పొగాకు బోర్డే అంగీకరించిందని పొగాకు రైతు మారెళ్ల బంగారుబాబు అన్నారు. కనీసం ఆ ఆర్డర్ల మేరకైనా మద్దతు ధర ఇవ్వాలని కోరారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సిండికేట్‌కు కొమ్ములు వచ్చాయని, ఒక్క పొగాకు రైతులే కాదు రాష్ట్రంలోని అనేక వర్గాలు ఆ సిండికేట్ వల్ల ఇబ్బందులు పడుతున్నాయని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శించారు.

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతుల ప్రయోజనాలను కాపాడే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.