భారత్ న్యూస్ రాజమండ్రి…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కూటమి సర్కార్ పర్యాటక అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుంది, ఈ క్రమం లో కృష్ణానదిలో పర్యాటకులకు మరింత ఆహ్లాద కరమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ కొత్త అడుగు వేయనుంది. డీజిల్ బోట్లకు ప్రత్యామ్నా యంగా సోలార్ శక్తి తో నడిచే మెకనైజ్డ్ బోట్లను ప్రవేశపెట్టా లని సంస్థ నిర్ణయిం చింది.
ఈ మేరకు జరిగిన ఏపీటీడీసీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోగా.. సోలార్ బోటు నమూనాను కూడా సభ్యులకు ప్రదర్శిం చారు. ప్రయోగాత్మ కంగా నాలుగు సోలార్ మెకనైజ్డ్ బోట్లను కొనుగోలు చేయాలని నిర్ణయిం చారు. విజయవాడ ప్రాంతంలో ఏడాది పొడవునా సూర్య కాంతి ఎక్కువగా లభించే పరిస్థితుల ను దృష్టిలో పెట్టు కుని ఈ నాలుగు బోట్లను బెజవాడ డివిజన్‌కు కేటాయిం చనున్నారు.
ప్రస్తుతం కృష్ణానది లో పర్యాటక సేవల కోసం డీజిల్‌తో నడిచే మెకనైజ్డ్ బోట్లు వినియోగం లో ఉన్నాయి. డీజి ల్ ధరల పెరుగుదల తో నిర్వహణ వ్యయం భారీగా పెరుగుతుండటం తో పాటు పర్యా వరణ కాలుష్యం కూడా ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో పర్యావరణహిత రవాణాను ప్రోత్స హిస్తూ సోలార్ బోట్ల ను అందుబాటులోకి తీసుకురావాలని ఏపీటీడీసీ నిర్ణయించింది.సాధారణ మెకనైజ్డ్ బోటు ధర సుమారు రూ. 30 లక్షలు కాగా.. సోలార్ మెకనైజ్డ్ బోటు ధర సుమారు రూ.50 లక్షలు ఉంటుంది. నాలుగు బోట్ల కొనుగోలుకు దాదాపు రూ.2 కోట్ల వ్యయం అవుతుం దని అంచనా.

ఇందుకోసం టెండర్లు లేదా కొటేషన్లు ఆహ్వానించి, తక్కువ ధరకు నాణ్యమైన బోట్లను అందించే సంస్థకు కాంట్రాక్టు ఇవ్వను న్నారు. ఒకటి నుం చి రెండు నెలల్లో ఈ బోట్లు అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉందని సమాచా రం. సోలార్ బోట్ల ప్రత్యేకత ఏమిటం టే.. ఇవి డీజిల్ బోట్లతో పోలిస్తే శబ్దం తక్కువగా చేస్తాయి. దీంతో పర్యాటకులు కృష్ణా నది సహజసౌంద ర్యాన్ని ప్రశాంత వాతావరణంలో ఆస్వాదించే అవ కాశం ఉంటుంది.