జగన్‌కు పొగాకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు… నీ హయాంలో కంటితుడుపు చర్యలే – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఫైర్

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.జగన్‌కు పొగాకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు… నీ హయాంలో కంటితుడుపు చర్యలే – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఫైర్రైతుల కోసం పని చేసింది టీడీపీ ప్రభుత్వం… రైతులను గాలికొదిలింది జగన్ ప్రభుత్వం

Ammiraju Udaya Shankar.sharma News Editor…నాడు మార్కెట్ జోక్యంతో రైతులను ఆదుకున్నాం… నేడు రూ.300 కోట్లతో హెచ్‌డీ బ‌ర్లీ పొగాకు కొనుగోలు చేశాం

  • ఇప్పుడు ఎఫ్ సీ వీ పొగాకు రైతుల‌కు అండ‌గా నిలుస్తున్నాం
  • నీ హయాంలో రైతులు విలవిల్లాడితే చూస్తూ ఊరుకున్నావు… ఇప్పుడు మమ్మల్ని విమర్శించే అర్హత ఎక్కడిది?

అమరావతి, జూలై 22: పొగాకు రైతుల సంక్షేమం కోసం నిజంగా పనిచేసింది తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మాత్రమేనని, రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు నీతులు చెప్పడం గొడ్డ‌లి పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏమాత్రం తగదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఘాటుగా విమర్శించారు. జగన్ హయాంలో పొగాకు రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినా స్పందించలేదని, చేసిన కొనుగోళ్లు కూడా కేవలం కంటితుడుపు చర్యలుగా మాత్రమే మిగిలిపోయాయని మండిపడ్డారు. రైతుల కష్టాలు పట్టించుకోకుండా ఐదేళ్లు గడిపిన జగన్… ఇప్పుడు రైతులపై ప్రేమ ఒలకబోస్తూ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా జోక్యం చేసుకుని పొగాకు రైతులను ఆదుకున్నామని మంత్రి గుర్తు చేశారు. 2014-15 పంట సీజన్‌లో పొగాకు కిలోకు రూ.20 చొప్పున ధరల పరిహారం అందించామ‌ని తెలిపారు. అయితే 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా కేవ‌లం 12.93 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేయ‌టం త‌ప్పా , రైతులకు నిజమైన ఉపశమనం కలిగించే విధంగా మార్కెట్‌లో సమర్థవంతమైన జోక్యం చేయలేకపోయిందన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయిన సమయంలో వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పొగాకు రైతుల సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని చర్యలు ప్రారంభించిందని మంత్రి తెలిపారు. గత ఏడాదిలోనే సుమారు 35 మిలియన్ కిలోల హెచ్‌డీ బ‌ర్లీ పొగాకును రూ.300 కోట్ల విలువతో కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామని పేర్కొన్నారు.

అదే విధంగా వర్జీనియా పొగాకు రైతుల సమస్యల పరిష్కారంలో కూడా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిపై కేంద్ర వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ వెంటనే స్పందించి, పొగాకు కొనుగోలు చేస్తున్న అన్ని కంపెనీలకు రైతుల వద్ద ఉన్న మొత్తం వర్జీనియా పొగాకు పంటను కొనుగోలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్ సీ వీ పొగాకు రైతుల‌ను ఖ‌చ్చితంగా అదుకుంటామ‌ని, కేంద్ర మంత్రి ఆదేశాలకు కంపెనీలు కూడా సానుకూలంగా స్పందించి రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకును కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపాయని చెప్పారు. జగన్ సిండికేట్‌ల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. నీ పాలనంతా దోచుకోవడం, దాచుకోవడం, సిండికేట్ రాజకీయాలకే పరిమితమైనందున అందరూ అలాగే వ్యవహరిస్తారని భ్రమపడుతున్నావు. అదే నీ రాజకీయ ఆలోచనా విధానానికి నిదర్శనం. రైతుల ప్రయోజనాల కోసం పారదర్శకంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలి. వర్జీనియా పొగాకు ధరల పతనం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల కాదు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గుదల, ఎగుమతులపై ఏర్పడిన ప్రతికూల ప్రభావం, దేశీయంగా జీఎస్‌టీ పెరుగుదల వంటి అనేక జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలే దీనికి ప్రధాన కారణాలు. ఈ వాస్తవాలను తెలిసినా ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం జగన్ రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం కంటే, ఐదేళ్ల నీ పాలనలో పొగాకు రైతుల కోసం ఏం చేశావో ప్రజలకు చెప్పడం మంచిది. ఇప్పుడు రైతుల సంక్షేమంపై నీతులు చెప్పడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నావా? లేక తెలిసే రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారం చేస్తున్నావా? అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. రైతుల కష్టాలను రాజకీయాలకు వాడుకోవడం మానేసి, నిజాలను అంగీకరించే ధైర్యం చూపాలని గొడ్డ‌లి పార్టీ అధ్య‌క్షుడు జగన్‌కు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు.