భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..అమృత్‌సర్‌లో ఒక మహిళ బ్యాంక్ నుండి ₹15 లక్షలు డ్రా చేసి తీసుకువచ్చింది.
ఆమె ఆ డబ్బును తన స్కూటీలో పెట్టి, బండి స్టార్ట్ చేయబోతుండగా…
అంతలోనే వెనుక నుండి మోటార్ సైకిల్‌పై వచ్చిన దుండగులు, ఆ మహిళ బ్యాగ్‌ను లాక్కుని పారిపోయారు.
సహాయం కోసం ఆ మహిళ గట్టిగా అరుస్తూ, ఏడుస్తూ ఉండిపోయింది.
దుండగులు పూర్తి ప్లానింగ్‌తోనే ఈ దోపిడీకి పాల్పడినట్లు అనిపిస్తోంది.
ముందు బైక్‌పై నిలబడిన వ్యక్తి కూడా ఆ దుండగుల సహచరుడే అయ్యింటాడని భావిస్తున్నారు….

