భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుమారు మూడు గంటలపాటు కేబినెట్ సమావేశం జరిగింది.
భోగాపురం విమానాశ్రయం పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.
రెండో దశలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై మరింత అధ్యయనం చేయాలని నిర్ణయించారు.
50 ఏళ్లలోపు ఉన్న చేనేత కార్మికులకు ‘నేతన్న భరోసా’ కింద రూ.25 వేలు చొప్పున ఆర్థికసాయం అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
వెదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడానికి ఏపీ కేబినెట్ నుంచి ఆమోదం లభించింది.
శ్రీకాకుళంలోని బ్రహ్మకుమారీస్ సంస్థకు మున్సిపల్ స్థల లీజును కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Ammiraju Udaya Shankar.sharma News Editor…పుష్కరాల నిర్వహణ, భద్రత, బందోబస్తు ఏర్పాట్ల కోసం రూ.50 కోట్ల నిధుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, ఏపీ మార్క్‌ఫెడ్‌కు సెంట్రల్ బ్యాంక్ నుంచి రూ.300 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వడం వంటి అంశాలకు ఆమోదం లభించింది.
విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ, చలపతి యూనివర్సిటీలను ప్రైవేట్ యూనివర్సిటీల జాబితాలో చేర్చే ఆర్డినెన్స్‌పై కూడా మంత్రివర్గం చర్చించింది.
నేరడి బ్యారేజ్ నిర్మాణానికి రూ.641.10 కోట్ల పరిపాలనా అనుమతుల మంజూరుపై చర్చ జరిగింది.
హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్-2 పనుల అంచనా వ్యయాన్ని రూ.241.20 కోట్ల నుంచి రూ.312 కోట్లకు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
ఎల్‌నినోను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు.
ఎలినోవా పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని చెప్పారు.

తాగునీటి సరఫరా, పశువులకు మేతపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రులు, అధికారులకు సూచించారు.
