భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఏపీ సీఎం చంద్ర బాబు అధ్యక్షతన గురువారం వెలగపూడి లోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమో దముద్ర పడింది, రాష్ట్రంలోని నిరు ద్యోగులకు ఊరుట నిస్తూ.. 3,168 ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి క్యాబినెట్ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Ammiraju Udaya Shankar.sharma News Editor…ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపిన కేబినెట్, అదేవిధంగా చేనేత కార్మికులకు ‘నేతన్న భరోసా’ పథకం కింద ఒక్కొక్కరికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయం తీసుకుంది.
అలాగే బాపట్లలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు, గోదావరి పుష్కరాల భద్రతా ఏర్పాట్ల కోసం రూ.50 కోట్లు మంజూరు, ఏపీ మార్క్‌ఫెడ్‌కు సెంట్రల్ బ్యాంక్ నుంచి లభించే రూ.300 కోట్ల రుణానికి రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ ఇవ్వడానికీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

