భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..2005లో ఓ ఎగ్జిబిషన్ ప్రోగ్రాంలో కేసీఆర్ జుట్టుతో తెలంగాణ చిత్రపటం కార్టూన్ గీశాను
అప్పట్లో కేసీఆర్‌కు వొత్తుగా రింగు రింగుల జుట్టు ఉండేది
ఆ కార్యక్రమానికి కేసీఆర్, చిరంజీవి వచ్చారు.. నేను గీసిన కార్టూన్ చూసి నన్ను ఇంటికి లంచ్‌కు పిలిచారు
నేను కోపంతో పిలిచాడేమో అని భయంభయంగా వెళ్లాను.. అన్ని ఐటమ్స్ పెట్టి మంచిగా భోజనం పెట్టాడు
ఆ తర్వాత నేను గీసిన కార్టూన్ చూసి చిరంజీవి ఏదో అడిగాడు.. “ఏంటి?” అని అడిగాడు
అప్పుడు నేను “కేసీఆర్ తల తాకట్టు పెట్టైనా తెలంగాణ తెస్తాడు అని తలలో తెలంగాణను గీశాను” అని చెప్పాను

అప్పుడు కేసీఆర్ నన్ను హగ్ చేసుకున్నాడు.. నా జీవితంలో జరిగిన అద్భుతం అదే
కార్టూనిస్ట్ శంకర్…
