ఏ. కొండూరు మండలంలోని జెడ్పీ హైస్కూల్‌లో పోక్సో చట్టం, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం..

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఏ. కొండూరు మండలంలోని జెడ్పీ హైస్కూల్‌లో పోక్సో చట్టం, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం..

ఎన్టీఆర్ జిల్లా..

ఏ. కొండూరు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు పోక్సో (POCSO) చట్టం మరియు బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు..

ఈ సందర్భంగా సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జి. మహాలక్ష్ముడు విద్యార్థులకు పోక్సో చట్టం ముఖ్యాంశాలు, మంచి స్పర్శ (Good Touch) – చెడు స్పర్శ (Bad Touch) మధ్య తేడా, సైబర్ నేరాల నుండి రక్షణ, సామాజిక మాధ్యమాల బాధ్యతాయుత వినియోగం గురించి వివరించారు..

అపరిచితులతో వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, OTPలు లేదా ఇతర గోప్య వివరాలను పంచుకోవద్దని సూచించారు..

ఎవరైనా వేధింపులకు గురిచేసినా అనుమానాస్పదంగా ప్రవర్తించినా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు..

అత్యవసర పరిస్థితుల్లో 112 లేదా 1930 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలని తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.