jobs.తెలంగాణలో 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ANM) పోస్టుల భర్తీకి

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..తెలంగాణలో 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ANM) పోస్టుల భర్తీకి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను శుక్రవారం విడుదల చేసింది.

గతంలో అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం.. వాటిని పరిశీలించి ఈ జాబితాను ప్రకటించారు. నియామకాల్లో పారదర్శకత కోసం, అభ్యర్థులు తమ అభ్యంతరాలను జులై 13 నుంచి జులై 15 సాయంత్రం 5 గంటల వరకు MHSRB వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని బోర్డు తెలిపింది.

అభ్యంతరాలు ఒక్కసారి మాత్రమే స్వీకరించబడతాయని సూచించింది…