భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..కృష్ణాజిల్లా, మచిలీపట్నం:
కృష్ణాజిల్లాలో యూరియా కొరతపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.
ఖరీఫ్-2026 సీజన్‌కు అవసరమైన యూరియా నిల్వలు జిల్లాలో సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సుమారు 41 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా వేయగా, జూలై 10 నాటికి 29,923 మెట్రిక్ టన్నుల యూరియా రిటైల్ కేంద్రాలకు సరఫరా చేయబడింది.

ప్రస్తుతం 18,534 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలో ఉందని అధికారులు వెల్లడించారు.
రైతులకు యూరియా పంపిణీని మరింత పారదర్శకంగా, సులభంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన Framework for Fertilizer Sale (FFS) యాప్‌ను కృష్ణాజిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.
ఈ యాప్ ద్వారా రైతులు ముందుగానే యూరియాను బుక్ చేసుకోవచ్చు, సమీప డీలర్ల వద్ద స్టాక్ వివరాలు తెలుసుకోవచ్చు. బుకింగ్ అనంతరం వచ్చే QR కోడ్‌తో 48 గంటలలోపు ఎరువులను పొందవచ్చు.
కౌలు రైతులు సహా అన్ని వర్గాల రైతులు ఈ సేవలను వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
యాప్ ద్వారా ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, అక్రమ మళ్లింపులకు అడ్డుకట్ట పడటంతో పాటు, సబ్సిడీ ఎరువులు నిజమైన రైతులకు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది.
అందువల్ల రైతులు యూరియా కోసం ఆందోళన చెందకుండా FFS యాప్‌ను వినియోగించి సులభంగా బుకింగ్ చేసుకోవాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
