భారత్ న్యూస్ వరంగల్…వారికి గుడ్‌న్యూస్.. ఇవాళ అకౌంట్లోకి డబ్బులు
తెలంగాణ ఆరోగ్య శాఖ పరిధిలోని కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఇకపై ప్రతి నెల 1వ తేదీకే వేతనాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది.
ఇప్పటికే పలువురు ఉద్యోగుల ఖాతాల్లో ఈ నెల జీతాలు జమ అయ్యాయి.
అయితే టీవీవీపీ పరిధిలోని సుమారు 1,700 మంది ఉద్యోగులకు సాంకేతిక కారణాలతో ఆలస్యం అయ్యింది.

దీంతో వారికి సోమవారం జమకానున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను టీవీవీపీ అధికారులు పూర్తి చేశారు