భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన భుజానికి జరిగిన శస్త్ర చికిత్సకు అయిన ఖర్చు మొత్తం సొంత నిధుల నుంచే వెచ్చిస్తున్నారు. ఆపరేషన్ తోపాటు ప్రయాణానికి అయ్యే ఖర్చులు

Ammiraju Udaya Shankar.sharma News Editor…మొత్తం స్వయంగా భరిస్తున్నారు. గతంలో ముక్కుకి జరిగిన శస్త్ర చికిత్స సైతం సొంత నిధులతోనే చేయించుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తినప్పుడు చికిత్సకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నుంచి పొందే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదన్న స్వీయ నిబంధనను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నారు.

