యూపీలో కాళ్లు, చేతులు కడుక్కోవడానికి నదిలోకి దిగిన 12 ఏళ్ల బాలుడిని సజీవంగా తినేసిన మొసలి….

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..యూపీలో కాళ్లు, చేతులు కడుక్కోవడానికి నదిలోకి దిగిన 12 ఏళ్ల బాలుడిని సజీవంగా తినేసిన మొసలి….

ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్ జిల్లాలో గురువారం వరి నాట్లు వేసిన తర్వాత కాళ్లు, చేతులు కడుక్కోవడానికి నదిలోకి దిగిన 12 ఏళ్ల బాలుడిని మొసలి సజీవంగా తినేసింది.

మొసలి ఆ బాలుడిని తన దవడలతో పట్టుకుని నీటిలో కొడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు రాళ్లు, కర్రలు విసిరినా అది బాలుడిని వదలలేదు.

మొసలి బాలుడి కాళ్లు, పొట్ట భాగాన్ని తినేసింది. 5 గంటల తర్వాత బాలుడి ఛిద్రమైన మృతదేహాన్ని వెలికితీశారు…..