తెలంగాణలో 36కు పెరగనున్న వెల్నెస్ సెంటర్లు: మంత్రి దామోదర

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..తెలంగాణలో 36కు పెరగనున్న వెల్నెస్ సెంటర్లు: మంత్రి దామోదర

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, రిటైర్డ్ సిబ్బందికి అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు వెల్నెస్ సెంటర్ల సంఖ్యను 12 నుంచి 36కు పెంచనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

ఈ కొత్త కేంద్రాలలో నిపుణులైన వైద్యులతో పాటు ఉచిత ఓపీ సేవలు, మందులు, డయాగ్నోస్టిక్స్ అందించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

సాధారణ చికిత్సలతో పాటు గైనకాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ వంటి స్పెషాలిటీ సేవలను కూడా దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు.