భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హైదరాబాద్‌లో ఈనెల 16 నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభం

Ammiraju Udaya Shankar.sharma News Editor…హైదరాబాద్‌లో ఆషాఢ బోనాల ఉత్సవాలు జులై 16 నుంచి ఆగస్టు 13 వరకు వైభవంగా జరగనున్నాయి.
ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించింది. జులై 16న గోల్కొండ అమ్మవారికి తొలి బోనంతో వేడుకలు మొదలవుతాయి.
జులై 19న సికింద్రాబాద్ బోనాల అంకురార్పణ, 26న బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం జరుగుతాయి. అలాగే ఆగస్టు 2న లష్కర్ బోనాలు, 9న పాతబస్తీ బోనాలు, 10న రంగం (భవిష్యవాణి) ఉత్సవం నిర్వహిస్తారు.

