నదిలో పోయే నీటిని ఎత్తిపోయండి: ఈటల

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..నదిలో పోయే నీటిని ఎత్తిపోయండి: ఈటల

తెలంగాణ :

మేడిగడ్డలో నీటిని నిల్వ చేయకుండా నదిలో వృథాగా పోతున్న నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగిస్తే ప్రశ్నిస్తానని హెచ్చరించారు.

తాను ఏ పార్టీని విమర్శించేందుకు రాలేదని, బాధ్యత గల పాలకులను మాత్రమే ప్రశ్నిస్తున్నానని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీటి నిర్వహణపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఈటల సూచించారు.